డావో ఈవీ వచ్చేస్తోంది..

డావో ఈవీ వచ్చేస్తోంది..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్
మూడేళ్లలో రూ.710 కోట్ల పెట్టు బడి
కృష్ణపట్నం పోర్ట్‌‌కు దగ్గర్లో మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్

 

గ్లో బల్ టూవీలర్స్ సెగ్మెంట్‌ లో ఉన్న డావో ఈవీటెక్ ఇండియన్ మార్కెట్‌ లోకి వస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ లో, తమ తొలి ఈవీ ప్రొడక్ట్‌‌ను(లో స్పీడ్ వేరియంట్‌ ను) వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయబోతున్నట్టు కంపెనీ డైరెక్టర్, సీఎఫ్‌ ఓ బాలాజి అచ్యుతుని చెప్పారు. హై స్పీడ్ వేరియంట్లను ఏప్రిల్‌‌లో తీసుకొస్తామని వెల్లడిం చారు. లో స్పీడ్ వేరియంట్ల కాస్ట్ రూ.50 వేల నుంచి రూ.75 వేల మధ్యలో ఉండగా.. హై స్పీడ్ వేరియంట్ల కాస్ట్ రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుం దని తెలిపారు. ఫిబ్రవరిలో 10 నుంచి
15 మోడల్స్‌‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఏపీలోని కృష్ణపట్నం పోర్ట్‌‌కు 50 కి.మీ నుంచి 60 కి.మీ సమీపంలో మానుఫ్యాక్చరింగ్ ప్లాం ట్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్టు బాలాజీ వెల్లడిం చారు. ఈ ప్లాం ట్‌ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఆరు నెలల్లో ప్లాం ట్‌ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ప్లాం ట్‌ నుంచి తొలి ప్రొడక్ట్‌‌ను నవంబర్‌‌‌‌లో తీసుకొస్తామని తెలిపారు. రెండు వేల మందికి ప్రత్యక్షం గా ఉద్యోగావకాశాలు కల్పిం చనున్నామని, మరో రెండు నుంచి మూడు వేల మందిని నియమించు కోనున్నామని చెప్పారు. మొత్తంగా మూడేళ్లలో 100 మిలియన్ డాలర్లు(రూ.710 కోట్లు) పెట్టు బడిగా పెట్టనున్నట్టు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికిల్ అడాప్షన్‌‌ను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌కు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది.

లైఫ్‌ టైమ్ ఫ్రీ సర్వీసు…
చైనాలో డావో ప్రస్తుతం 150కి పైగా ఎలక్ట్రిక్ వేరియంట్లను విక్రయించింది. ఇండియాలో కూడా మరిన్ని మోడల్స్‌‌ను తీసుకురావాలని చూస్తోంది.
ఒక్కసా రి ఛార్జింగ్ చేస్తే 100 కి.మీ నుంచి 125 కి.మీ వరకు ఈ వెహికిల్ ప్రయాణించగలదు. మూడేళ్ల వారంటీతో ఈవీలను లాంచ్ చేస్తోంది. ఈ కంపెనీ వెహికిల్స్‌‌కు ప్యాన్ ఇండియా బేసిస్‌లో డావో డీలర్ నెట్‌ వర్క్ వద్ద లైఫ్‌ టైమ్ ఫ్రీ సర్వీసు ను ఆఫర్ చేస్తోంది.ఈ వెహికిల్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. లో స్పీడ్ గంటకు 25 కి.మీ. వార్షికంగా డావో 15 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లను ప్రొడ్యూస్ చేస్తోంది. మూడు లక్ష్యాలతో ఇండియన్ మార్కెట్‌ లోకి ఎంటర్‌‌‌‌ అవుతున్నట్టు డావో సీఈవో, ఛైర్మన్ మైఖేల్ లియూ చెప్పారు. ఒకటి ఇండియన్ కస్టమర్లకు ఆహ్లాదకరమైన ఫ్యూచర్‌‌‌‌ను అందిం చాలని, రెండోది బెస్ట్‌‌కు భారతీయులు ఎల్లప్పుడూ అర్హులేనని, మూడు యంగ్ ప్రొఫెషనల్స్‌‌ను డీలర్లుగా డెవలప్
చేయాలని, వారిని సక్సెస్‌ ఫుల్ ఎంటర్‌‌‌‌ప్రిన్యూర్లు గా చూడాలని అనుకుంటు న్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్టేషన్‌‌ను పూర్తిగా 2023ఈవీల్లో కి మార్చాలని చూస్తున్నట్టు కంపెనీ గుర్తు చేసింది. ఈ నెల 19, 20వ తేదీల్లో న్యూఢిల్లీలో చైనా నైట్స్‌‌ను నిర్వహిస్తున్నారు.