Danish Kaneria: పాకిస్థాన్ జట్టుకు గంభీర్ కోచింగ్ అవసరం: మాజీ స్పిన్నర్ కనేరియా

పాకిస్థాన్ జట్టుకు ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. ఏడాది కాలంగా పాక్ క్రికెట్ ను పరీశీలిస్తే అద్వానంగా తయారైంది. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. కెప్టెన్, కోచ్ లను మార్చినా ఆ జట్టు తలరాత మారడం లేదు. చిన్న జట్లపై.. పసికూనలపై ఓడిపోతుంది. తాజాగా బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో సైతం 0-2 తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్‌ కనేరియా పాకిస్థాన్ కు గంభీర్ లాంటి కోచ్ కావాలని సూచించాడు. 

"ప్రస్తుతం గంభీర్ భారత జట్టుతో ఉన్నాడు. పాకిస్థాన్ జట్టుకు గంభీర్ కోచింగ్ అవసరం.అతను ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెబుతాడు. అతను అద్భుతమైన క్రికెటర్. ఏ విషయంలో వెనకడుగు వేయడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఇలానే బలంగా ఉండాలి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ నేను ఎవరినైనా కెప్టెన్‌గా చేస్తే ఆ వ్యక్తి ఒక ఏడాది సమయం ఇచ్చి మద్దతుగా నిలుస్తా. సంవత్సరం తర్వాత సమాధానం చెప్పమని అడుగుతా. ఆ ఏడాది కాలవ్యవధిలో అతడు మంచి ప్రదర్శన చేయకపోతే ఆ బాధ్యతల నుంచి వైదొలగమని చెబుతా.’’ అని డానిష్ కనేరియా సూచించాడు.

ALSO READ | IND vs BAN 2024: టీమిండియాలోకి బుమ్రా.. భారత్‌ను భయపెట్టిన బంగ్లా

ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టును గంభీర్ సమర్ధవంతగా నడిపాడు. అతను కోచ్ గా ఉన్న సమయంలో జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ జట్టుకు వచ్చి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారత జట్టు హెడ్ కోచ్ గా గంభీర్ కు అవకాశమొచ్చింది. భారత్ సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. మరోవైపు పాకిస్థాన్ స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ కు ప్లాన్ చేస్తుంది.