పాటకు ప్రాణం పోసేలా.. హావభావయుతంగా డ్యాన్స్ చేయగలిగే వారికి అవకాశం. అటువంటి ప్రతిభావంతుల కోసం ఆహా, ఓక్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా 'డ్యాన్స్ ఐకాన్' షో నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన ఆడిషన్స్ జూన్ 22 నుంచి జూలై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే అర్హులు. 60 సెకన్ల డ్యాన్స్ వీడియోను danceikon@oakentertainments.com మెయిల్ చేయాలని ఈ షోకు యాంకర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఓంకార్ వెల్లడించారు. ''ఈ షో ద్వారా నేను ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహాకు ధన్యవాదాలు. నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను. కానీ ఇది డిఫరెంట్‌గా ఉండబోతోంది’’ అని తెలిపారు. ‘‘ఈ షో కంటెస్టంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది. గెలిచిన కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్‌కు టాలీవుడ్లో ఒక పెద్ద హీరోకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది'' అని చెప్పారు.
'డ్యాన్స్ ఐకాన్' షో.. ఆడిషన్స్ ప్రారంభం
- టాకీస్
- June 22, 2022
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
