స్వాతంత్య్రం అడగట్లే..

స్వాతంత్య్రం అడగట్లే..

జమ్మూ: టిబెట్ కు  కాస్త అర్థవంతమైన స్వయంప్రతిపత్తి కావాలని కోరుతున్నాం తప్ప చైనా నుంచి స్వాతంత్ర్యాన్ని అడగ ట్లేదని ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. తద్వారా బౌద్ధ సంస్కృతిని పరిరక్షించాలన్నదే తమ ఉద్దేశమని, ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే చైనా ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. ఆయన శుక్రవా రం లడఖ్​లో పర్యటించాల్సి ఉన్నందున గురువారం జమ్మూకు చేరుకున్నారు. దలైలామా లడఖ్ పర్యటనపై అభ్యంతరం తెలిపిన చైనాను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు కరడుగట్టిన చైనీయులు తనను వేర్పాటు వాదిగా, దేశవ్యతిరేకిగా భావిస్తూ నిత్యం విమర్శలు చేస్తున్నారని అన్నారు. మనుషులందరూ సమానమేనని, ప్రజల మధ్య అల్లర్లకు కారణమైన నా దేశం, నా సిద్ధాంతం అనే సంకుచిత భావజాలం నుంచి బయటకురావాలని దలైలామా సూచించారు.