పాలు రోడ్డుపై పారబోసి.. పాల రైతుల ఆందోళన..

జడ్చర్ల,వెలుగు : జడ్చర్ల పట్టణంలో పాల రైతులు గురువారం  రోడ్డుపై పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు.   విజయడైరీ యాజమాన్యం  పాలబిల్లులు చెల్లించడం లేదని,  పెండింగ్​ బిల్లులన్ని క్లియర్​ చేయాలని  గురువారం మంత్రి పొంగులేటి  శ్రీనివాస్​ రెడ్డిని అడిగేందుకు యత్నించారు.  జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డిని పారమర్శించి వెళ్తుండగా..   పట్టణంలో మంత్రి కాన్వాయ్​ను అడ్డుకొని   తమ సమస్యలు వివరించాలనుకున్నారు. 

కానీ రైతులు రోడ్డుపై గుమిగూడేలోపు మంత్రి కాన్వాయ్​ పట్టణాన్ని దాటి వెళ్లిపోయింది. దీంతో రైతులు నిరసనగా పాలను రోడ్డుపై పోసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   పోలీసు లు  జోక్యం చేసుకుని, రైతులు ధర్నాను విరమింపజేశారు.