బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే రెండు సాంగ్స్‌ను రిలీజ్ చేయగా, గురువారం(Jan2న) మూడో పాటను విడుదల చేశారు.
‘ఉల్లాల ఉల్లాల.. నా మువ్వ గోపాల.. కత్తులతోటే కాదు.. కంటిచూపుతోనే చంపాలా.. నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే.. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి.. నీ చేయే ఎత్తు బాలా ’ అంటూ సాగిన స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణ, ఊర్వశీ రౌతేలా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. తమన్ సాంగ్ కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాశాడు. తమన్, వాగ్దేవి కలిసి పాడారు.
దబిడి దిబిడి ఎలా ఉంది?
ప్రస్తుతం దబిడి దిబిడి సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. కానీ, అంతకు అంత సోషల్ మీడియాలో ట్రోల్స్ పెంచుకుంటూ వెళుతోంది. బాలకృష్ణ, ఊర్వశి రౌతేలపై చిత్రీకరించిన ఈ పాటలోని పేలవమైన డ్యాన్స్‌పై విమర్శలు వస్తున్నాయి.
Ninna #Peelings... Ippudu #DabidiDibidi...
— NEWS3PEOPLE (@news3people) January 2, 2025
Enti Shekar sir ee Choreography ??????#DaakuMaharaaj pic.twitter.com/pUMVuT179C
డ్యాన్స్ మాస్టర్ శేఖర్ 'అనుచితమైన డ్యాన్స్ మూవ్‌లు' ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 64 ఏళ్ల బాలకృష్ణ.. 30 ఏళ్ల ఊర్వశి రౌతేలా డ్యాన్స్ మూమెంట్స్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపుతున్నారు.
ALSO READ | శ్రీకాంత్ సినిమాకి మెగాస్టార్ చిరు షాకింగ్ రెమ్యునరేషన్.. అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.?
Oreyyy Sekhar gaaaaa
— ?????? ✰»? (@Ustaad_Kalyan18) January 2, 2025
Ave em steps raaaa ??????? pic.twitter.com/Y4BZbnIHni
'నిన్న ఫీలింగ్స్.. నేడు దబిడి దిబిడి' ఏంటీ శేఖర్ సార్? ఈ డ్యాన్స్ స్టెప్పులు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే చెప్పుకోలేనంతగా.. తమదైన ట్యాగ్స్ తో ట్రోలింగ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఇదేమి అర్ధం కానీ ఊర్వశి రౌతేల మాత్రం వాటిని తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుని ప్రోమోట్ చేస్తుంది. ఆ కామెంట్స్ కనుక చూస్తే తట్టుకోలేరు భయ్యా.. అంతే!
Idhem step ra Mentalodaa ?#DabidiDibidi #Daakumaharaj pic.twitter.com/fSUXbvVjJp
— ?NAG (@priyathamKING) January 3, 2025
బాలయ్య కెరీర్‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.