థేల్స్‌ సప్లయర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డు-2020 అందుకున్న సైయెంట్‌

థేల్స్‌ సప్లయర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డు-2020 అందుకున్న సైయెంట్‌
హైదరాబాద్:‌ గ్లోబ‌ల్ ఇంజినీరింగ్‌ మరియు డిజిటల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ సైయెంట్ 2020 సప్లయర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డును థేల్స్‌ నుంచి అందుకున్నట్లు వెల్లడించింది. స‌రైన స‌మ‌య‌లో ఉత్ప‌త్తుల‌ను స‌ర‌ఫరా చేయ‌డంలో ఏ రేటింగ్ అందుకోవ‌డంతో ఈ అవార్డును ప్ర‌క‌టించింది. ఈ నెల 15వ తేదీన జరిగిన థేల్స్‌ వర్ట్యువల్‌ యాన్యువల్‌ సప్లయర్‌ సదస్సు వద్ద సైయంట్ ఈ అవార్డును అందుకుంది. ఈ అవార్డు గురించి సైయెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో రాజేంద్ర వెలగపూడి మాట్లాడుతూ ‘‘ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. సైయెంట్‌ మరియు థేల్స్ మ‌ధ్య‌ వ్యూహాత్మక బంధాన్ని ఇది ప్ర‌తిబింబిస్తుంద‌ని అన్నారు. ఆత్మ నిర్భ‌ర్‌ భారత్‌ నిర్మాణంలో మా తోడ్పాటును సైతం ఇది ప్రతిబింబిస్తుంది. థేల్స్‌తో మా సంబంధంను ఉన్నత శిఖరాఖాలకు తీసుకువెళ్లేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.