సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం.. రూ. కోటి నష్టపోయిన ప్రైవేటు ఉద్యోగి

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బృందావన్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరగాళ్లకు చిక్కాడు.  సుమారు కోటి రూపాయలు నష్టపోయాడు. గత నెల 17వ తేదీన ట్రేడింగ్ సంబంధించి ఒక మెసేజ్ రాగా దాని ఓపెన్ చేసి తన వివరాలతో ఐడి క్రియేట్ చేసి పలు దఫాలుగా 98 లక్షల 40 వేల పెట్టుబడి పెట్టాడు. అనంతరం ఐడిలో చూపిస్తున్న కమిషన్, అతను పెట్టిన నగదును ఇవ్వమని అడగగా సైబర్ నేరస్తులు స్పందించలేదు. 

దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్ వారిని ఆశ్రయించాడు. అనంతరం వారు కేసును అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి లక్ష రూపాయల నగదు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడానికి కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.