గిఫ్ట్ ల పేరుతో స్టూడెంట్​ను మోసం చేసిన సైబర్ చీటర్స్

బషీర్ బాగ్, వెలుగు: గిఫ్ట్ ల పేరిట ఓ  స్టూడెంట్​ను సైబర్ చీటర్స్ మోసాగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన 22 ఏళ్ల యువతికి సైబర్ చీటర్స్ ఫోన్ కాల్ చేశారు. గతంలో  యువతి షాపింగ్ చేసిన ఫాక్స్టలే కంపెనీ ప్రతినిధిగా ఫోన్ చేసి,   కంపెనీ తరుపున  ఫ్రీ గిఫ్ట్స్  గెలుచుకున్నట్లు తెలిపారు. అందుకు  రూ. 5 వేల విలువ చేసే  ఓచర్స్ కొనుగోలు చేయించారు. అనంతరం షిప్ మెంట్ కోసం  అడ్రెస్ అడిగి  గిఫ్ట్స్ కు  జీఎస్టీ  చెల్లించాలని కోరారు.

ALSO READ : జాగ్రత్తగా ఉండాలె.. బ్యాంకు ఖాతా KYC పేరుతో రూ. 13 లక్షలు కొట్టేశారు

ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. దీంతో ఆమె  డబ్బును స్కామర్లకు పంపించింది. అయితే బాధితురాలు చెల్లించిన డబ్బు తమకు ట్రాన్స్ఫర్​ కాలేదని బుకాయించారు. మరల డబ్బులు పంపించాలని , పూర్తి డబ్బు రిఫండ్ అవుతుందని ఒత్తిడి చేశారు. దీనితో బాధిత యువతి మళ్లీ డబ్బులు పంపించింది. తరువాత స్కామర్ల నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాకపోవడంతో ,  మొత్తం రూ 1,30,367 లను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  యువతి ఫిర్యాదు తో కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.