న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్.. క్లిక్ చేస్తే పైసలు మాయం

  • ఏపీకే ఫైల్స్ పట్ల అలెర్ట్ గా ఉండాలి 
  • టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు 

హైదరాబాద్: న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాస్ వేశారని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. 'ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నావారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమేకాదు. ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. న్యూ ఇయర్ విషెస్ ఫొటోలు, మెసేజ్ లను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు. 

ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. బ్యాంకు అకౌంటివివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సం వత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ALSO READ | 2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్

ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అంతా జాగ్రత్తగా ఉండాలి' అని సూచించారు.