48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా

పక్కా స్కెచ్.. ప్లానింగ్ తో కేవలం 48 గంటల్లోనే రూ.3కోట్లు కొట్టేశారు. అంతే కాదు క్షణాల్లోనే ఆ డబ్బు వాళ్ల అకౌంట్లోకి మారిపోయింది. ఫ్రాడ్ ను కనిపెట్టకుండా ఉండేందుకు కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు గుజరాత్‌లోని వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. సైబర్ నేరస్థులు తెలివి లేని, చదువు రాని వ్యక్తిని కాదు మోసం చేసింది. పాట్నా యూనివర్శిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ప్రొఫెసర్ ను టార్గెంట్ గా చేసుకొని డిజిటల్ అరెస్ట్ స్కాం చేశారు సైబర్ నేరగాళ్లు. కడంకువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఫైల్ అయిన ఈ కేసు ఇండియాలోనే అతి భారీ సైబర్ క్రైమ్. 

సదరు బాధితురాలు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫోన్ చేసి బెదిరించారు దుండగులు. కొంతమంది ఫేక్ ఐడీ కార్డులతో ఆమె ఇళ్లు చెక్ చేశారు. రిటైర్డ్ ఫ్రొపెసర్ అవినీతిలో ప్రమేయం ఉందని నమ్మించి మోసం చేశారు. కొద్దిసేపటికే సీబీఐ అధికారులుగా నటిస్తూ సైబర్ నేరగాళ్లు ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. మనీలాండరింగ్‌ కేసులో ఆమెపై విచారణ జరుగుతోందని, వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించారు. వృద్ధురాలిని బెదిరించి రూ.3.07 కోట్లు ఐదు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్సఫర్ చేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ అయినా ఆ మహిళ ఒంటరిగా ఉండటం వల్లే ఈ టైంలో ఆమెకు ఎవరి సపోర్ట్ అందలేదు. 

ALSO READ | డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఇంజినీర్​ను నిర్బంధించి 10 కోట్లు దోచిన కేటుగాళ్లు

48 గంటల్లోనే ఇంతపెద్ద సైబర్ క్రైం చేసి.. రూ.3.07 కోట్లు కొట్టేశారు. దుండగులు  తర్వాత ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి సైబర్ క్రైం బ్రాంచ్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇండియాలో ఇది ఆల్ టైం రికార్డ్ సైబర్ క్రైం. ఇంతకు ముందు భారీ ఫ్రాడ్ గా రూ.2.84 కోట్ల స్కాం ఉండే. ఆ డబ్బులు ట్రాన్సవర్ అయిన అకౌంట్ల ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.