జనగణనతో పాటే కులగణన.. సీఎం రేవంత్ ప్రతిపాదనకు సీడబ్ల్యూసీ ఆమోదం

త్వరలో పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరిగే  చాన్స్ ఉన్నందున.. జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాదిలో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  అందువల్ల ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలన్నారు.  నియోజక వర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. కర్ణాటకలోని బెల్గావీలో జరుగుతోన్న సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. 

చట్ట సభలలో మహిళ బిల్లును కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలోనే ప్రవేశ పెట్టి ఒక కొలిక్కి తెచ్చిన  క్రమంలో ఆ బిల్లుపై ఎక్కవగా ప్రచారం చేయాలన్నారు. బీజేపీ మహిళ బిల్లుతో వారికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆ విషయంలో కాంగ్రెస్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు రేవంత్. కులగణన తెలంగాణలో దేశంలోనే మార్గదర్శిగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జన గణనలో దేశ వ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలన్నారు.  ఈ విషయంలో  తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని రేవంత్ రెడ్డి సూచించగా రేవంత్ రెడ్డి ప్రతిపాదనను సిడబ్ల్యుసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించింది . 

ALSO READ | కర్ణాటకలో CWC సమావేశాలకు హాజరైన మల్లికార్జున ఖర్గే, రాహుల్