వామ్మో వీడు మామూలోడు కాదు.. బంగారం స్మగ్లింగ్ చేయడంలో వీడు చాలా ముదురు ఉన్నట్టున్నాడు. అక్కడా ఇక్కడా పెడితే గుర్తిస్తారని..ఏకంగా ఎవరికి అనుమానం రావొద్దని బ్లూటూత్ స్పీకర్లలో పెట్టి..అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నాడు. ఎయిర్ పోర్టు పోలీసులు చాకచక్యంగా వాటి లగేజీని చెక్ చేసి స్మగ్లర్ గారి బండారం బయటపెట్టారు. కేరళలోని కోచి ఎయిర్ పోర్టులో బ్లూటూత్ స్పీకర్లలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారు. వివరాల్లోకి వెళితే..
కోచి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం (జూన్ 18) భారీగా బంగారు పట్టుబడింది. రియాద్ నుంచి కోచికి వచ్చిన ప్రయాణికుడి నుంచి 99లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. బంగారాన్ని బ్లూటూత్ స్పీకర్లలో పెట్టి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నారు. అతని లగేజ్ చెకింగ్ చేస్తుం డగా బ్లూటూత్ స్పీకర్లలో ఏదో ఉందని అనుమానించిన ఎయిర్ పోర్టు అథారిటీ విప్పి చూడంగా బంగారు బయట పడింది. రెండు స్పీకర్లలో ముద్దగా చేసి దాచిన 1.3కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు.
అక్రమంగా బంగారు రియాద్ నుంచి తరలిస్తున్న ప్రయాణికుడు నౌషద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
