చెన్నై ఎయిర్ పోర్టుకు పొలాండ్ నుంచి వచ్చిన పోస్టల్ పార్శిల్ లో 107 సజీవంగా ఉన్న విషపూరిత సాలె పురుగులను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. తమిళనాడులోని అరుపు కొట్టైకి చెందిన వ్యక్తి పేరిట ఈ పార్శిల్ వచ్చిందని చెప్పారు కస్టమ్స్ అధికారులు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే థర్మకొల్ 107 చిన్న ప్లాస్టిక్ వయల్స్ గుర్తించామని వాటి చుట్టూ సిల్వర్ ఫాయిల్, కాటన్ చుట్టి ఉందని చెప్పారు. వీటిని గుర్తించేందుకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను పిలిచామన్నారు. వీటిని పరిశీలించిన అధికారులు అవి బ్రాచిపెల్మా, ఫోనో పెల్మా జాతికి చెందినవని గుర్తించారని చెప్పారు. ఇవి ఎక్కువగా మధ్య అమెరికా, మెక్సికోలో కనిపిస్తాయన్నారు. వీటిని సీజ్ చేసిన అధికారులు తిరిగి పొలాండ్ పంపేందుకి పోస్టల్ అధికారులకు పార్శిల్ అప్పగించారు.
