చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం, విదేశీ సిగరెట్లు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. గల్ఫ్ నుంచి వచ్చిన కేటుగాళ్ల నుంచి రూ.2.53 కోట్ల విలువైన 5.5 కిలలో బంగారం సీజ్ చేశారు. 24లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విగ్, సాక్సులు, లో దుస్తుల్లో దాచి దీసుకొచ్చిన ఆరుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు అధికారులు.
