రియాద్: ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం సౌదీ అరేబియాలోని రియాద్ లోని ఓ రెస్టారెంట్ లోనిది. లోపల టేబుళ్లపై కనిపిస్తున్నవి... పేపర్ గ్లాసులు, ప్లేట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, సోడా బాటిళ్లు, సగం తిని పడేసిన పదార్థాలు. రంజాన్ పండగను పురస్కరించుకొని కొంతమంది కస్టమర్లు కేఎఫ్సీ రెస్టారెంట్ కి వచ్చారు. వాళ్లకు కావాల్సినవి ఆర్డర్ చేసుకున్నారు. కడుపునిండా తిన్నాక... టేబుళ్లపై వస్తువులను ఇలా ఇష్టమొచ్చినట్లుగా వదిలేసి వెళ్లారు. అందులో పని చేసే ఓ వర్కర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చెత్త మెస్ ను ఇప్పటి వరకు చూడలేదని కొందరు కామెంట్ చేస్తుంటే... ఇది ముమ్మాటికి సిబ్బంది నిర్లక్ష్యమని మరి కొందరూ అంటున్నారు. పక్కనే డస్ట్ బిన్ ఉంచుకొని ఏంటీ ఈ చెత్త... లేజీ ఫెలోస్ అని ఇంకొకరు అంటుంటే... ఇలాంటి వాళ్లకు గట్టిగా ఫైన్ వేయాలని మరి కొందరు వాదిస్తున్నారు. ఇకపోతే.. ఆ చెత్తనంతా క్లీన్ చేయడానికి ముగ్గురు వర్కర్లకు రోజంతా పట్టిందని రెస్టారెంట్ ఓనర్ తెలిపాడు.
మరిన్ని వార్తల కోసం...
