కరెంట్ బిల్లు కట్టమంటే.. విద్యుత్​ ఉద్యోగిపై దాడి

కూకట్​పల్లి, వెలుగు : కరెంట్​బిల్లు కట్టమన్నందుకు ఆగ్రహించిన అన్నదమ్ములు విద్యుత్​శాఖ ఉద్యోగిపై దాడి చేశారు. కేపీహెచ్​బీ కాలనీ రెండో రోడ్డులోని ఈడబ్ల్యూఎస్​ప్లాట్​నంబర్​109లో నివసించే వినియోగదారులు కొంతకాలంగా బిల్లు కట్టలేదు. దీంతో విద్యుత్​ శాఖలో లైన్​మెన్​గా పనిచేస్తున్న బండారు శ్యామ్ శుక్రవారం​వారి ఇంటికి వెళ్లాడు.

కరెంట్​బిల్లు ఓవర్​డ్యూ ఉందని, వెంటనే కట్టకపోతే కనెక్షన్​కట్​చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆ ఇంట్లోని అన్నదమ్ములు హుస్సేన్​(37), రంజాన్​(34) శ్యామ్​పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.