ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియెంటేషన్ సెషన్ముగింపు సందర్భంగా గురువారం రాత్రి సిటీలోని తారామతి బారాదరిలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టత వివరిస్తూ రూపొందించిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
– ఫొటోగ్రాఫర్, వెలుగు