9 దేశాల్లో పూర్తిగా బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..42 దేశాల్లో కొంచెం బ్యాన్‌‌

9 దేశాల్లో పూర్తిగా బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..42 దేశాల్లో కొంచెం బ్యాన్‌‌

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 51 దేశాలు క్రిప్టో కరెన్సీలను బ్యాన్ చేశాయి. ఇందులో 9 దేశాలు క్రిప్టోలను ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తుండగా, 42 దేశాలు మాత్రం పరోక్షంగా  బ్యాన్ చేశాయి. అంటే ఆయా దేశాల్లోని ఫైనాన్షియల్ సంస్థలు క్రిప్టోలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లను జరపకుండా రిస్ట్రిక్షన్లు పెట్టాయి. ఈ విషయాలను గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీగల్ రీసెర్చ్ డైరెక్టరేట్ ఆఫ్ ది లా లైబ్రరీ ఆఫ్​ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయటపెట్టింది.  2018 నుంచి క్రిప్టోలను బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న దేశాలు పెరుగుతున్నాయని ఈ రిపోర్ట్ వివరించింది. 2018 లో క్రిప్టోలను పూర్తిగా బ్యాన్ చేసిన కంట్రీలు 8 అని, పాక్షికంగా నిషేధించిన కంట్రీలు 15 అని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం ఇటువంటి దేశాలు రెండింతలు పెరిగాయని పేర్కొంది. అల్జేరియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైనా, ఈజిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మొరాకో, నేపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టూనిషియా దేశాలు క్రిప్టోలను పూర్తిగా బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఈ ఏడాది  మే, జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రిప్టో మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చైనా, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూర్తిగా క్రిప్టో ట్రాన్సాక్షన్లపై నిషేధం విధించింది. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ వాల్యూ 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.   చాలా దేశాలు క్రిప్టోలపై ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా వేస్తున్నాయి. మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫైనాన్షియల్ టెర్రరిజం చట్టాల కిందకు వీటిని తెస్తున్నాయి.  క్రిప్టోలపై ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, యాంటి మనీలాండరింగ్, యాంటి టెర్రరిజం ఫైనాన్షియల్ చట్టాలను అమలు చేయడంలో యూఎస్ ముందుందని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది.