నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై మళ్లీ సీఆర్పిఎఫ్ బలగాల మోహరింపు

నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై సీఆర్పిఎఫ్ భద్రత తొలగించారు. నాగార్జున సాగర్ డ్యాం తిరిగి ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వచ్చింది. అయితే శనివారం ఉదయం 10 గంటలకు నాగర్జున సాగర్ డ్యాం నుంచి వెళ్ళిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలు... తిరిగి మళ్లీ రాత్రి ఏడు గంటలకు సాగర్ ప్రధాని డ్యాంని ఆధీనంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. 

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. బోర్డుకు ఇండెంట్‌ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని..13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. 

తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో  ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 

ఈ క్రమంలో సమయంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ఉద్రికత్త తగ్గింది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన కూడా చేశారు.

Also Read :- దమ్ముంటే చదివించండీ.. ఫీజుల మోత మోగనుంది

ఐతే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరింది. 

ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం భద్రత కేఆర్ ఎంబీ అధీనంలో ఉండటంతో సీఆర్ పీఎఫ్ బలగాలతో భద్రత నిఘాలో ఉంది.. శనివారం సీఆర్పీఎఫ్ నుంచి భద్రతపరమైన చర్యలను ఎస్పీఎఫ్ అప్పజెప్పారు. అయితే ఉదయం 10 గంటలకు నాగర్జున సాగర్ డ్యాం నుంచి వెళ్ళిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలు... తిరిగి మళ్లీ రాత్రి ఏడు గంటలకు సాగర్ ప్రధాని డ్యాంని ఆధీనంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది.