టీచర్లతో డీఈఓ ఆఫీస్​ కిటకిట

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు , అప్​గ్రేడెషన్​ కోసం సోమవారం స్థానిక డీఈఓ ఆఫీస్​లో సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ నిర్వహించారు. సీనియార్టీ జాబితా ప్రకారం సోమవారం లాంగ్వేజ్ పండిట్ , పీఈటీ సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. దీంతో జిల్లాలోని టీచర్లు డీఈఓ ఆఫీస్​కు వచ్చారు. ఆఫీస్​ టీచర్లతో కిటకిట లాడింది. ఎన్నో రోజులుగా ఉన్న పెండింగ్ ఉన్న సమస్యలను వారి ట్రాన్స్ఫర్లకు అభ్యంతరాలను స్వీకరించారు. కాగా సోమవారం , మంగళవారం లాంగ్వేజ్ పండిత్ , పీఈటీల సర్టిఫికేట్​ వెరిఫికేషన్ల కోసం కేటాయించారు. -ఫొటోగ్రాఫర్​ నిజామాబాద్, వెలుగు