జోగులాంబ ఆలయంలో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముందుగా గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.