అలంపూర్​లో భక్తుల సందడి

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు శనివారం భక్తులు పోటెత్తారు.  తెల్లవారుజాము నుంచే స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అలంపూర్ కు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.