థరూర్ మండలం స్కూల్​ ఆవరణలో మొసలి

గద్వాల, వెలుగు : థరూర్ మండలంలోని గుడ్డం దొడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ ఆవరణలో గురువారం ఓ పెద్ద మొసలి కనిపించింది. గమనించిన స్థానికులు ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో   ఫారెస్ట్ ఆఫీసర్ ఫర్వేజ్ అహ్మద్  అక్కడికి చేరుకొని మొసలిని  పట్టుకున్నారు.  

గ్రామ సమీపంలోని  కెనాల్  నుంచి ఈ మొసలి వచ్చిందని,   ఇది సుమారు 150 కేజీలు ఉంటుందని వారు తెలిపారు.   మొసలిని బంధించి  జూరాల రిజర్వాయర్ లో వదిలిపెట్టారు.