నేరస్తులపై ‘రాచకొండ’ ఉక్కుపాదం.. ఏడాదిలో పెరిగిన క్రైమ్​రేట్​ 4 శాతమే!

  • నిరుడు కంటే 1,040 కేసులు ఎక్కువ నమోదు 
  • క్రిమినల్స్​కు శిక్ష పడేలా చేయడంలో స్టేట్​లోనే ఫస్ట్​  
  • సగానికి తగ్గిన దారి దోపిడీలు
  • 42 శాతం పెరిగిన సైబర్ నేరాలు 
  • 17 శాతం ఎక్కువగా అత్యాచారాలు
  • వచ్చే ఏడాది కొత్త పోలీస్ స్టేషన్స్‌‌‌‌, డివిజన్స్‌‌‌‌ 
  • 2024 వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్‌‌‌‌‌‌‌‌బాబు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్​రేట్​4 శాతం మాత్రమే పెరిగిందని సీపీ సుధీర్‌‌‌‌‌‌‌‌బాబు వెల్లడించారు. ఎక్కడెక్కడ అఫెన్సెస్​ జరుగుతున్నాయి? ఎక్కడ ఫోకస్​ చేయాలి? ఇన్సిడెంట్​ జరిగిన వెంటనే రెస్పాండ్​అవ్వడం వల్ల  ఇది సాధ్యమైందన్నారు. నిరుడు 27,586 కేసులు నమోదు కాగా, ఈసారి 28, 626 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే, గతేడాది కంటే ఈ సంవత్సరం 42.5 శాతం అధికంగా సైబర్ క్రైమ్స్​నమోదయ్యాయని తెలిపారు.

గతేడాది 2, 562 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4,458  సైబర్ క్రైమ్ కేసులు రిపోర్టయ్యాయని చెప్పారు.  2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను సోమవారం నాగోల్‌‌‌‌లోని ఎస్‌‌‌‌వీఎం గ్రాండ్‌‌‌‌ హోటల్​లో సీపీ విడుదల చేశారు. అన్ని జోన్లు, డివిజన్లు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌‌‌‌స్పెక్టర్లతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.  

ALSO READ : ఆరు నెలల్లో టిమ్స్ను అందుబాటులోకి తెస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి

నేరాల కట్టడి చేసేందుకు ‘వక్త్‌‌‌‌’
నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే క్రైమ్​జరగకముందే నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా తమ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో వక్త్(వీ క్యూ టీ) పేరుతో వినూత్న కార్యాచరణ చేపట్టినట్లు సీపీ తెలిపారు. విజుబుల్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌, క్విక్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌, టెక్నాలజీతో విజిబుల్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే 2025 లో కొత్త పోలీస్ స్టేషన్స్‌‌‌‌, డివిజన్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

తగ్గిన వేధింపులు, పోక్సో కేసులు
కమినరేట్‌‌‌‌ పరిధిలో లైంగికదాడులు 17 శాతం పెరిగాయని, వరకట్న హత్యలు 13 శాతం, హత్యలు 11 శాతం, కిడ్నాప్‌‌‌‌లు10 శాతం, ఫిజికల్​అటాక్​కు సంబంధించి 9 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ప్రాపర్టీ నేరాల్లో మాత్రం తగ్గుదల కనిపించిందన్నారు. దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌‌‌‌లు గణనీయంగా తగ్గాయన్నారు. దారిదోపిడీలు 50 శాతం తగ్గగా, దోపిడీలు 6 శాతం, దొంగతనాలు17శాతం, బైక్స్‌‌‌‌ చోరీలు ఒక శాతం తగ్గినట్టు పేర్కొన్నారు. మహిళలపై దాడుల కేసుల్లో గృహ హింస 23 శాతం, లైంగిక వేధింపులు, పోక్సోకేసులు 10 శాతం తగ్గాయన్నారు.