ఆర్థిక సాయం చేసి కుక్కను కాపాడండి..: భారత క్రికెటర్ సోదరి

జంతు ప్రేమికురాలైన శ్రేయాస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ అభిమానుల నుంచి ఆర్థిక సాయం కోరుతోంది. తీవ్ర గాయాల బారిన పడిన ఓ కుక్క(జాయ్‌) సర్జరీ కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థిక సాయం చేయాల్సిందిగా క్రికెటర్ సోదరి అభిమానులను అర్థించింది. కనీసం రూ.50 చొప్పున సాయం అందించినా.. జాయ్‌ మేలు కోరిన వారు అవుతారంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను ప్రాధేయపడింది.

Google Pay నెంబర్..

మంచి మనసుండి ఆర్థిక సాయం చేయాలనుకునేవారు 91670 09033 నెంబర్‌కు డబ్బు పంపవచ్చని శ్రేష్ఠ అయ్యర్ అభిమానులకు సూచించింది. ఇక్కడో ముఖ్య విషయం.. ఈ నెంబర్ ఆమెది కాదు.. జాయ్‌కు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్‌ది. గమనించగలరు. అక్కడితో ఆర్థిక సాయం చేసిన వారిని మరిచిపోనని.. ఎప్పటికప్పుడు జాయ్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటానని శ్రేష్ట అభిమానులకు హామీ ఇచ్చింది. 

Also Read :- AI భవిష్యత్కు ఇండియన్ టాలెంట్ చాలా కీలకం

శ్రేష్ట ఓ స్టార్ క్రికెటర్ సోదరి అయ్యుండి ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందో మీకు ఆశ్చర్యపోవచ్చు. అందుకు గల కారణాలేంటనేది తానూ వెల్లడించలేదు.

చివరగా కొన్ని గంటల క్రితం జాయ్ ఆపరేషన్ విజయవంతమైందని, పూర్తి ఆరోగ్యంగా ఉందని అభిమానులకు తెలియజేసింది. అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.