డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌.. అధికారికంగా డిప్యూటీ సూపరిండెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ను కలిసి నియామక పత్రాన్ని అందుకున్నాడు.

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ గెలిచిన జట్టు సభ్యుడైన సిరాజ్‌‌‌‌‌‌‌‌కు.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో 600 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ప్రకటించారు.