ఏంటి రాహులన్నా ఇది.. ఓడామన్న బాధ ఇసుమంతైనా లేదా..!: అభిమాని

భార్య పుట్టినరోజు నాడు భర్త ప్రేమను వ్యక్తపరచడం తప్పా..! చెప్పండి.. విష్ చేయకపోతే, ఎన్ని తిట్లు పడాలో.. ఎన్ని రోజులు భార్య అలక దృశ్యాలు చూడాలో తెలిసినవాడు కాబట్టి భార్యపై తనకున్న ప్రేమను బయటకు వ్యక్తపరచాడు. అది తప్పంటోంది.. ఈ ప్రపంచం. 

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి పుట్టినరోజు నేడు. 1992 నవంబర్ 5న జన్మించిన అథియా.. మంగళవారంతో 31 ఏళ్లు పూర్తి చేసుకొని.. 32వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భగా రాహుల్.. "మై క్రేజీ బర్త్‌డే బేబీ(My craziee birthday baby)" అంటూ భార్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు, కొన్ని అన్‌సీన్ ఫోటోలను సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశాడు. దీన్ని పాజిటివ్‌గా తీసుకోలేని కొందరు అభిమానులు అతన్ని విమర్శిస్తున్నారు.

అభిమానుల విమర్శలు

ఇటీవల భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను రోహిత్ సేన విజయం అన్నదే లేకుండా ముగిచింది. పొట్టి ప్రపంచకప్ చాంపియన్లం అని విర్రవీగిన టీమిండియాను కివీస్ ఆటగాళ్లు చిత్తుచిత్తుగా ఓడించారు. సొంతగడ్డపై అనుకూలించే పరిస్థితులు, స్పిన్‌ ఆడటంలో సుదీర్ఘ అనుభవం ఉన్నా.. మనోళ్లు పొడిచింది ఏమీ లేదు. ఈ సిరీస్‌లో మన బ్యాటర్లు స్పిన్‌ ఆడలేక చతికిలపడ్డ తీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

Also Read:-భారత్‍లో 2036 ఒలింపిక్స్!

ఈ టెస్ట్ సిరీస్‌లో రాహుల్ ఆడింది మాత్రం.. ఒకే ఒక మ్యాచ్. బెంగుళూరు వేదికగా తొలి టెస్టులో మాత్రమే అతను కనిపించాడు. మిగిలిన రెండు ఓటముల్లో అతన్ని బాధ్యుణ్ణి చేయడం అర్థం లేనిది. ఇది పట్టించుకోని అభిమానులు అతనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ ఓటమికి.. అతని పోస్టుకి లింకెడుతూ తిడుతున్నారు. అది కూడా ఒక పనిలా పెట్టుకొని నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.