IND Vs AUS: తిరిగొచ్చిన స్టార్ పేసర్.. గబ్బా టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్టు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం, శనివారం(డిసెంబర్ 14) ఉదయం 5:30 గంటలకు టెస్ట్ షురూ కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. 

గాయం కారణంగా రెండు టెస్టుకు దూరమైన జోష్‌ హేజిల్‌వుడ్‌ తిరిగి తుది జట్టులో చోటు సంపాదించాడు. హేజిల్‌వుడ్‌ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్కాట్‌ బోలాండ్‌ను పక్కన పెట్టింది. ఈ ఒక్క మార్పు మినహా ముగిసిన ఆటగాళ్లందరూ యధాతధం. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ ఓపెనర్లుగా రానుండగా.. ఫస్ట్ డౌన్ లో మార్నస్ లాబుషాగ్నే.. సెకండ్ డౌన్ లో స్టీవ్ స్మిత్.. మూడో స్థానంలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేయనున్నారు. జట్టులో నాథన్ లయన్ ఏకైక స్పిన్నర్. 

ALSO READ : Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ గుడ్ బై

ఇప్పటివరకు గబ్బా వేదికపై ఏడు టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. ఐదింట ఓడిపోగా.. ఒకే ఒక్కసారి విజయాన్ని నమోదు చేసింది. మరో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 2021లో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రమే ఆస్ట్రేలియాను భార‌త జ‌ట్టు ఓడించింది.

మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్.