IND vs AUS: టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఆసీస్ కుర్రాళ్ల జట్టు ఇదే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ తర్వాత టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండో టెస్టుకు పది రోజులు గ్యాప్ రావడంతో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్ నిర్వహించారు. నవంబర్ 30, డిసెంబర్ 1న జరగబోయే ఈ మ్యాచ్ కు మనుకా ఓవల్‌లో జరగనుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా క్రికెట్ శుక్రవారం (నవంబర్ 22) 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టులో టెస్ట్ పేసర్ స్కాట్ బోలాండ్ శుక్రవారం చోటు దక్కించుకున్నాడు .

ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుకు న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ నాయకత్వం వహిస్తాడు. అడిలైడ్ లో డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్ టెస్ట్ ప్రారంభమవుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో సైతం పింక్-బాల్ ను ఉపయోగించనున్నారు. భారత్ కు ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పెర్త్ టెస్టుకు దూరమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకుంటున్న గిల్ ఈ మ్యాచ్ లో ఆడి తమ ఫామ్, ఫిట్ నెస్ నిరూపించుకోనున్నారు. 

Also Read : తేడా జరిగితే అతను సర్దుకోవడమే

ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ స్క్వాడ్

జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), చార్లీ ఆండర్సన్, మహ్లీ బార్డ్‌మాన్, స్కాట్ బోలాండ్, జాక్ క్లేటన్, ఐడాన్ ఓ'కానర్, ఒల్లీ డేవిస్, జేడెన్ గుడ్‌విన్, సామ్ హార్పర్, హన్నో జాకబ్స్, సామ్ కాన్స్టాస్, లాయిడ్ పోప్, మాథ్యూ రెన్‌షా, జెమ్ ర్యాన్.