IND vs AUS: వార్నర్ వారసుడిగా స్వీనే.. భారత్‌తో సమరానికి ఆసీస్ జట్టు ప్రకటన

స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో 13 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. అనూహ్యంగా ఆసీస్ జట్టులో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. 

వార్నర్ వారసుడు

ఆసీస్ మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వారసుడిగా నాథన్ మెక్‌స్వీనే ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా-ఏ తరఫున రాణించిన మెక్‌స్వీనే పట్ల ఆస్ట్రేలియా సెలెక్టర్లు నమ్మకముంచారు. ఇక కంగారూల జట్టు తరపున టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న జోష్ ఇంగ్లిస్‌ చోటుదక్కించుకున్నాడు. బ్యాటర్‌గా, బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఇంగ్లిష్‪ను సెలక్ట్ చేశారు. 

పెర్త్ వేదికగా తొలి టెస్టు

ఈ నెల(నవంబర్) 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ చేరాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. దాంతో, హోరాహోరీ తప్పదు. రోహిత్ సేన 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా ఫైనల్ చేరుకోవచ్చు. 

తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.

టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • నవంబర్ 22-26: తొలి టెస్టు (పెర్త్.. ఉదయం 7.30 గంటలకు)
  • డిసెంబర్ 06-10: రెండో టెస్టు (అడిలైడ్.. ఉదయం 9.30 గంటలకు)
  • డిసెంబర్ 14-18: మూడో టెస్టు (బ్రిస్బేన్.. ఉదయం 5.50 గంటలకు)
  • డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు (మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
  • జనవరి 03-08: ఐదో టెస్టు (సిడ్నీ.. ఉదయం 5 గంటలకు)