హైదరాబాద్, వెలుగు: కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవెలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) వచ్చే ఫిబ్రవరిలో ‘హైదరాబాద్ ప్రాపర్టీ షో 2022’ను నిర్వహించనుంది. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సంస్థ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని క్రెడాయ్ ప్రెసిడెంట్రామకృష్ణా రావు చెప్పారు. సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 11-–13 తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రియల్ ఎస్టేట్ డెవెలపర్లు, మెటీరియల్ అమ్మకందారులు, మాన్యుఫాక్చరర్లు, కన్సల్టెంట్లు, బ్యాంకులు ఇక్కడ స్టాల్స్ నిర్వహిస్తారు. ప్రతి కస్టమర్బడ్జెట్కు తగిన ప్రాపర్టీలను డెవెలపర్లు చూపిస్తారు. టీఎస్ రెరా పర్మిషన్ ఉన్న టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్/కమర్షియల్ కాంప్లెక్స్‌లను ప్రదర్శిస్తారు.
