Cred CEO Salary: క్రెడ్ సీఈఓ కునాల్ షా శాలరీ ఎంతంటే..

Cred CEO Salary: క్రెడ్ సీఈఓ కునాల్ షా శాలరీ ఎంతంటే..

ఒక సీఈఓ శాలరీ నెలకు ఎంతుండొచ్చు? కంపెనీని బట్టి లక్షల నుంచి కోట్ల రూపాయల్లో ఉంటుంది. అయితే, ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్ సీఈఓ కునాల్ షా నెల జీతం మాత్రం రూ.15వేలే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనిథింగ్ అనే పోల్ ని నిర్వహించిన కునాల్.. ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తన జీతం విషయాన్ని పంచుకున్నారు. 

‘మీరు క్రెడ్ సీఈఓ. అయినా మీ జీతం ఎందుకంత తక్కువుంది? అంత తక్కువ జీతంతో మీరు ఎలా బతకగలుగుతున్నారు?’ అని ఫాలోవర్ అడిగాడు. దానికి సమాధానంగా ‘నా శాలరీ నెలకు రూ.15 వేలే. అయితే, కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను ఎక్కువ జీతం తీసుకోవాలనుకోవడం లేదు. అది కరెక్ట్ కాదనుకుంటున్నా. గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు ప్రస్తుతం సరిపోతుంది’ అని కునాల్ బదులిచ్చారు. 

అయితే, ఈ విషయంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. స్టార్టప్స్ లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు ఇప్పుడు ఉపయోగపడుతుందని కొందరు, టాక్స్ ని తప్పించుకోవడానికి ఇలాంటి ప్లాన్స్ వేస్తుంటారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.