హైడ్రా పేరిట హై డ్రామాలు : చుక్క రాములు

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు

కొమురవెల్లి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట హై డ్రామా చేస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు, జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం 3వ మహాసభ ఐనాపూర్ లో బద్దిపడిగ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ బుల్డోజర్ వ్యవస్థను అమలు చేస్తుంటే కాంగ్రెస్ హైడ్రా పేరిట పేదలను రోడ్ల మీదకు నెట్టివేస్తోందన్నారు. 6 గ్యారంటీల అమలు అటకెక్కించి సీఎం జూటా మాటలు చెప్తున్నారని మండిపడ్డారు.

రుణమాఫీ, రైతు బీమా, మద్దతు ధర, మహిళలకు రూ.2500, పింఛన్​పెంపు వంటి అంశాలు అబద్ధపు హామీలుగా మిగిలాయన్నారు. కార్యక్రమంలో గోపాల స్వామి, శారద, రవీందర్, శశిధర్, రవి కుమార్, ప్రశాంత్, ఇస్తారి, మల్లేశం, చక్రపాణి పాల్గొన్నారు.