లగచర్ల రైతుల గోడును సీఎంకు వినిపిస్తం : తమ్మినేని వీరభద్రం 

  • అధికారులపై దాడిని ఖండిస్తున్నాం: తమ్మినేని వీరభద్రం 

కొడంగల్, వెలుగు: లగచర్ల రైతుల గోడును సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి వినిపించి, భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కోరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఒకవేళ సీఎం ఒప్పుకోకపోతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. గురువారం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల నేతలు వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల, రోటిబండ తాండాల్లో పర్యటించి రైతులు, మహిళలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని ఖండించారు. తమ్మినేని మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు హుందాగా ఆలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పంట పొలాలు, ఇండ్లు నాశనం కాకుండా చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.