సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తాం

భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన  పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిస్తామని సీపీఎం నేతలు తెలిపారు. ఆదివారం సుందరయ్య 39వ వర్ధంతిని ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించారు.

ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుల వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.