భారత్ బయోటెక్ కంపెనీ తెలుగు రాష్ట్రాలలో వ్యాక్సిన్ తీసుకురావడం ప్రపంచంలోనే గర్వించదగ్గ విషయమని సీపీఐ నేత నారాయణ అన్నారు. వ్యాక్సిన్ తీసుకురావటంలో ఎంతో కృషి చేసిన ఎల్లా కృష్ణా, ఎల్ల సుచిత్రలకు ఆయన అభినందనలు తెలిపారు. ఓ వైపు కరోనాను ఎదుర్కోనే సైన్స్ అందుబాటులోకి వస్తుంటే.. మరోవైపు దేవుళ్ళ గురించి కొట్లాడుకునే పరిస్థితి ఏపీలో దాపురించింది. ఎవరికి వారు బొట్లు పెట్టుకుని ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు ఏ బొట్టు పెట్టుకున్నా చివరికి బీజేపీ వాళ్లకే ఉపయోగం. కమ్యూనిటీ పాలిటిక్స్ చేస్తూ.. మతోన్మాద రాజకీయాలు తీసుకురాకండి. దేవుళ్లపై గొడవ చేస్తే బీజేపీకే లాభం. టీడీపీ, వైసీపీ వాళ్లు వీటిపై రాజకీయాలు చెయ్యకండి. ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు.. వీలైతే వారికి సహకరించండి. రైతులు ఆందోళన పక్కదారి పట్టించడానికే బీజేపీ, ఆరెస్సెస్ ఇలాంటి మత సమస్యలు పుట్టిస్తున్నారు. రైతులు ఆకలితో చనిపోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టదు కానీ.. రాతి బొమ్మకు ఏదో జరిగిందని రోడ్లపైకి వస్తున్నారు’ అని ఆయన అన్నారు.
For More News..
త్వరలో నువ్వు ఏడుస్తావ్.. చెల్లికి ఫోన్ చేసి మరీ బావను చంపిన బామ్మర్దులు
కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసిన జాతీయ ఎస్సీ కమిషన్
సీఎంను చంపితే పది లక్షలిస్తామంటూ పోస్టర్
