పుష్ప సినిమా సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? : సీపీఐ నారాయణ

  • ఇలాంటి మూవీస్​ను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు: సీపీఐ నారాయణ

హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని సీపీఐ నేత నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం లాభం లేదన్నారు. స్మగ్లింగ్ ను ప్రోత్సహించేలా మూవీ ఉందని మండిపడ్డారు. రేవతి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హెల్త్ సీరియస్​గా ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన మీడియాకు రిలీజ్ చేశారు. రేవతి కుటుంబానికి సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. 

పుష్ప 2 సినిమాలో అసభ్యకరమైన పాటలున్నయ్. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అదేమన్నా.. సమాజానికి ఉపయోగపడే సినిమానా? ఇలాంటి మూవీస్​లను ప్రభుత్వం ప్రోత్సహించొద్దు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు సినీ, రాజకీయ వర్గాలు, కళాకారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి’’అని నారాయణ తెలిపారు.