పెండింగ్​ కేసులను సీరియస్​గా తీసుకోవాలి : సీపీ డాక్టర్ బి.అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పెండింగ్ దొంగతనాల కేసులను సీరియస్ గా తీసుకొని, టెక్నాలజీతోపాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి ఛేదించాలని సిద్దిపేట సీపీ డాక్టర్​ బి.అనురాధ అన్నారు. బుధవారం సీపీ ఆఫీస్​లో ఆమె ఆఫ్​ఇయర్లీ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్​ఇన్వెస్టిగేషన్​ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ తరచుగా నేరాలు చేసే నేరస్తులపై తప్పకుండా షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీలను ఏర్పాటు చేసి రెండు, మూడు నెలలకోసారి శాంతి సమావేశాలు నిర్వహించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు.

మత్తు పదార్థాలు సరఫరాపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అంతకుముందు సీపీ ఆఫీస్​ఆవరణలోని పెరేడ్​ గ్రౌండ్​లో వనమహోత్సవంలో భాగంగా ఆమె అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్.మల్లారెడ్డి, ఏసీపీలు మధు, సతీశ్, రవీందర్, శ్రీనివాస్, ఎస్బీ ఇన్​స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్బీ ఇన్​స్పెక్టర్ కమలాకర్, ఐటీ కోర్ ఎస్సై నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.