పోలీస్‌లు డయల్‌ 100 కాల్స్​కు స్పందించాలి : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు: పోలీస్ అధికారులు, సిబ్బంది డయల్ 100 కాల్స్ కు వెంటనే రెస్పాండ్ కావాలని సీపీ అనురాధ సూచించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా రాజగోపాలపేట, చిన్నకోడూర్ పీఎస్​లను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి  సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. 

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెట్టాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  కార్యక్రమంలో ఏసీపీ మధు, సీఐలు శ్రీను, కిరణ్, శ్రీధర్ గౌడ్, ఎస్ఐ ఆసిఫ్, బాలకృష్ణ పాల్గొన్నారు.