డ్రగ్స్​ నివారణపై అవగాహన కల్పించాలి : సీపీ అనురాధ

బెజ్జంకి, వెలుగు : గంజాయి, డ్రగ్స్​ ను నివారించేందుకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సీపీ అనురాధ తెలిపారు. బెజ్జంకి పీఎస్​ను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. మత్తు పదార్థాలు, సైబర్​ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై కాలేజీల్లో, స్కూళ్లలో ఎప్పుడూ అవగాహన కల్పిస్తూ ఉండాలని చెప్పారు.

పోలీసులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ.. బెల్ట్​ షాపుల  , ఇసుక అక్రమ రవాణాకు  అడ్డుకట్ట వేయాలని తెలిపారు. స్టేషన్​కు వచ్చే బాధితులతో మర్యాదగా  ఉండాలని, ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని చెప్పారు. వన మహోత్సవ సందర్భంగా పీఎస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మధు, సీఐ శీను, ఎస్​ఐలు కమలాకర్,  నరేందర్,  కృష్ణారెడ్డి, శంకర్ రావు తదితరులు  పాల్గొన్నారు.