ఆవు పాలు Vs గేదె పాలు.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ పాలు తాగాలంటే..

పాలు అత్యంత పోషక విలువలు కలిగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన ఎముకలు, దంతాలకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి వైద్యులు ప్రతిరోజూ పాలు తాగాలని కూడా సిఫార్సు చేస్తారు. అయితే మీరు ఆవు, గేదె పాలలో ఏది ఎంచుకోవాలి? ఈ రెండు రకాల పాలలో కొన్ని మంచి, కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. కావున ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. నీరు

ప్రతి వ్యక్తికి నీరు చాలా అవసరం. మీరు మీ శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచుకోవాలనుకుంటే ఆవు పాలు తాగడం ప్రారంభించండి. ఆవు పాలలో 90 శాతం నీరు ఉంటుంది. మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఇది సరైనది.

2. కొవ్వు

పాలు స్థిరమైన కొవ్వుకు బాధ్యత వహిస్తుంది. గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా ఉండడానికి ఇదే కారణం. ఆవు పాలలో 3-4 శాతం కొవ్వు ఉంటుంది, అయితే గేదె పాలలో 7-8 శాతం కొవ్వు ఉంటుంది. గేదె పాలు పొట్టకు బరువుగా ఉంటాయి. అందుకే జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అందుకే తాగిన తర్వాత ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.

3. కేలరీలు

గేదె పాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్లు, కొవ్వు ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు, ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి.

4. ప్రోటీన్

ఆవు పాలతో పోలిస్తే, గేదె పాలలో 10-11 శాతం ప్రోటీన్ ఉంటుంది. అధిక మొత్తంలో ప్రొటీన్లు ఉన్నందున, గేదె పాలు చిన్న పిల్లలకు, వృద్ధులకు సిఫార్సు చేయబడవు.

5. కొలెస్ట్రాల్

ఈ రెండు రకాల పాలలో కొలెస్ట్రాల్ పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. గేదె పాలలో తక్కువ కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది. కావున ఇది పీసీఓడీ, హైపర్‌టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్న వారికి అద్భుతమైంగా పని చేస్తుంది.

ఈ రెండు రకాల పాలూ ఆరోగ్యానికి మంచివే. ఈ రెండూ వాటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కావున మీరు ఏమి తాగాలనుకుంటున్నారనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీకు రాత్రి ప్రశాంతమైన నిద్ర కావాలంటే గేదె పాలు తాగితే మంచి నిద్ర వస్తుంది. ఖోయా, పెరుగు, ఖీర్, పాయసం, మలై, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలు ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.