కరోనా వ్యాక్సిన్ తయారీకి గ్లోబల్ హబ్ గా హైదరాబాద్

కరోనా వ్యాక్సిన్ తయారీకి గ్లోబల్ హబ్ గా హైదరాబాద్
చివరి స్టేజ్ లో భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్ జాన్సన్& జాన్సన్ వ్యాక్సిన్ తయారీకి బయోలాజికల్ఈ రెడీ యూబీ612 వ్యాక్సిన్ను తయారు చేయనున్న అరబిందో స్పుత్నిక్ వీని తేనున్న  డా.రెడ్డీస్, హెటిరో కరోనా మహమ్మారితో మరోసారి హైదరాబాద్ వెలుగులోకి వచ్చింది. ఈసారి కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందడుగుతో హైదరాబాద్ దూసుకెళ్తోంది. భారత్ బయోటెక్ తన సొంత వ్యాక్సిన్ను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉంటే, మరో నాలుగు కంపెనీలు గ్లోబల్ టై అప్స్తో ఇక్కడ వ్యాక్సిన్ తయారీకి రెడీ అవుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల ప్రతినిధులు ఇప్పటికే మన సిటీకి వచ్చి, వ్యాక్సిన్ ట్రెండ్స్ చూసి వెళ్లారు. కరోనా  వ్యాక్సిన్ తయారీలో   గ్లోబల్ హబ్గా హైదరాబాద్ నిలుస్తుందనే విషయంలో సందేహం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీలో ఏ కంపెనీ ఏ దశలో ఉందో చూద్దాం.. వెలుగు: కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా నిలవనుంది. ఐదు ఫార్మా, బయోటెక్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కరోనా వ్యాక్సిన్ను తయారు చేయడంలో పోటీ పడుతున్నాయి. తాజాగా 60 మంది విదేశీ ప్రతినిధులు సిటీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్–ఈ ప్లాంట్లను సందర్శించారు. దీన్ని బట్టి వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కు  గ్లోబల్ గా ప్రాధాన్యం ఉందనే విషయం అర్ధమవుతోందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ను తీసుకురావడంలో వివిధ స్టేజ్ లలో ఉన్నాయి. అరబిందో ఫార్మా, డా.రెడ్డీస్, హెటెరో  కంపెనీలు కూడా కరోనా వ్యాక్సిన్ను తయారు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలయితే వ్యాక్సిన్ తయారీ కోసం తమ మాన్యుఫాక్చరింగ్ సామర్ధ్యాన్ని మరింత పెంచుకుంటున్నాయి. కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీలే కాకుండా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కరోనా వ్యాక్సిన్ ఎగుమతి, దిగుమతుల  కోసం కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ విషయంపై కంపెనీ స్టేక్ హోల్డర్లతో చర్చలు జరుపుతోంది. భారత్ బయోటెక్ మినహాయించి పైన పేర్కొన్న మిగిలిన నాలుగు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తయారీలో విదేశీ కంపెనీలతో పార్టనర్షిప్ కుదుర్చుకున్నాయి. ఏ కంపెనీ ఎంత మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటోందో వంటి వివరాలేవి ఇంకా తెలియదని ఫార్మెక్సిల్ డైరక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ అన్నారు. ఈ విషయంపై కేంద్రానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఈ కంపెనీలు తెలంగాణలో ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ ను కేటాయించడంలో  రాష్ట్రానికి ఎటువంటి ప్రాధాన్యం ఉండదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ జీ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ట్రాలకు ఏ విధంగా వ్యాక్సిన్ ను కేటాయించాలో కేంద్రమే నిర్ణయిస్తుందని తెలిపారు.  కోవ్యాక్సిన్ ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్లాంట్ ను నవంబర్ 28 న ప్రధాని మోడీ సందర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యాక్సిన్ తయారీకి సంబంధించి హైదరాబాద్ బాగా పాపులర్ అయ్యిందని ఎనలిస్టులు చెబుతున్నారు.  ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ సంస్థలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో కలిసి భారత్ బయోటెక్ డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయి. దీనితో పాటు ముక్కు ద్వారా వేసే ఇంకో కరోనా వ్యాక్సిన్ను కూడా ఈ కంపెనీ డెవలప్ చేస్తోంది. బీఈ, అరబిందో, రెడ్డీస్, హెటెరో కూడా.. ఏడీ26.కోవ్2.ఎస్ కరోనా వ్యాక్సిన్ను తయారు చేయడానికి ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్కు చెందిన జాన్సెన్ ఫార్మా సూటికాతో  బయోలాజికల్–ఈ  (బీఈ) ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్పై  క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీ కెపాసిటీని పెంచడానికి, జనరిక్ వెర్షన్లో ఈ వ్యాక్సిన్ను తీసుకురావడానికి బీఈకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ. 220 కోట్లను అప్పుగా ఇచ్చింది. వ్యాక్సిన్ల తయారీ కోసం హైదరాబాద్లోని ప్లాంట్ను మరింత విస్తరించేందుకు అరబిందో ఫార్మా రూ. 275 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ ప్లాంట్లో కరోనా వ్యాక్సిన్తో పాటు ఇతర వ్యాక్సిన్లను కూడా తయారు చేయాలని చూస్తోంది. యూఎస్ కంపెనీ కోవాక్స్ డెవలప్ చేసిన యూబీ 612ను  తయారు చేసి, ఇండియా, యూనిసెఫ్, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమ్మడానికి అరబిందో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) డెవలప్ చేసిన స్పుత్నిక్ వీ  వ్యాక్సిన్ను తయారు చేయడానికి  డా. రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఈ వ్యాక్సిన్పై   క్లినికల్ ట్రయల్స్  చివరిదశకు చేరాయి. దేశంలో ఈ వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ జరపడానికి, మొదటి10 కోట్ల డోస్లను అమ్మడానికి ఆర్డీఐఎఫ్తో కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వీ డోస్లను తయారు చేయడానికి హెటెరో కూడా ఆర్డీఐఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా ట్రీట్మెంట్లో వాడే ఇతర మెడిసిన్స్ రెమ్డిసివిర్, ఫవిపిరవిర్ల బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్స్ను తయారు చేయడంలో కూడా ఈ 4  ఫార్మా కంపెనీలు కీలకంగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు  కూడా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. వ్యాక్సిన్ను రవాణా, పంపిణీ చేయడానికి ఇండియా సిద్ధంగా ఉంది.  దేశంలోని టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీలకు చెందిన 24 సెంటర్లలో కోవ్యాక్సిన్పై ఫేజ్ 3 ట్రయల్స్ జరుపుతున్నాం. దీంతో వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని మరింత  లోతుగా విశ్లేషించడానికి వీలుంటుంది ..డా. కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ చైర్మన్ ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్ను ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా  ఎటువంటి పాలసీ  తీసుకు రాలేదు. దేశీయ అవసరాలు తీరాక ఎగుమతులు చేసుకోవడానికి కేంద్రం అనుమతివ్వొచ్చు.  ఉదయ భాస్కర్, ఫార్మెక్సిల్ డైరక్టర్ జనరల్