భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. కోవీషీల్డ్ ను వినియోగించుకేందుకు ఎక్స్ పర్ట్ టీమ్ అనుమతిచ్చింది. సీరమ్ ఇండియా తయారు చేస్తున్న కోవీషీల్డ్ ను అత్యవసర పరిస్థితుల కింద వినియోగించుకునేలా అనుమతి లభిచింది. ఎక్స్ పర్ట్ కమిటీ అనుమతుల అనంతరం సెంట్రల్ డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఈఓ) అప్రూవల్ వచ్చిన రెండు, మూడు రోజుల్లో సుమారు. 5కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీరమ్ ఇండియా సీఈఓ ప్రకటించారు.
మరోవైపు కేంద్రం ఈ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీచేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ను అరికట్టేందుకు రెండో డోసులు అవసరం. ఒక్క డోసు ఇచ్చిన నాలుగు వారాల తరువాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో భాగంగా సీరమ్ కు దాదాపూ ఒక్కో డోస్ ఖరీదు రూ.225 నుంచి రూ.240వరకు ఉంటుందని, అలా కేంద్రం సీరమ్ కు సుమారు రూ.400పైగా చెల్లించనుంది. కాగా సీరమ్ తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను కేంద్రానికి రూ.400కే ఇస్తుంటే ఇతర దేశాల్లో దాని ఖరీదు సుమారు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది.
