ఆంధ్ర‌ప్రదేశ్ లో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్రదేశ్ లో 3 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

8,012 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ సోకిన బాధితుల సంఖ్య 3ల‌క్ష‌ల‌కు చేరుకుంది. మృతుల సంఖ్య 2,650 న‌మోదు కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 85,746 ఉన్న‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గ‌డిచిన 24గంట‌ల్లో ప్రభుత్వం 48,746 మందికి క‌రోనా టెస్ట్ లు చేసింది.

చిత్తూరులో ఒక్క‌రోజే అత్య‌ధికంగా 981కొత్త కేసులు న‌మోదు కాగా 10 మంది మ‌ర‌ణించారు. పశ్చిమ గోదావరి (893 కేసులు, 8 మరణాలు), తూర్పు గోదావరి (875 కేసులు , 10మ‌ర‌ణాలు ), కర్నూలు (834కేసులు , 9 మ‌ర‌ణాలు ), శ్రీకాకుళం (773కేసులు , 4మ‌ర‌ణాలు ), ప్రకాశం (614కేసులు , 4మ‌ర‌ణాలు ), గుంటూరు (590 కేసులు , 6 మ‌ర‌ణాలు), అనంతపురం (580మ‌ర‌ణాలు , 8 కేసులు ), విశాఖపట్నం (512 కేసులు , 8మ‌ర‌ణాలు), నెల్లూరు (423 కేసులు , 9 మ‌ర‌ణాలు ), విజయనగరం (286 కేసులు , 6 మ‌ర‌ణాలు ), కడ‌ప (286 కేసులు , 6మ‌ర‌ణాలు ), కృష్ణ (263కేసులు , 3మ‌ర‌ణాలు ) న‌మోదైన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.