75 ఏళ్ల తర్వాత కలిశారీ అన్నదమ్ములు

75 ఏళ్ల తర్వాత  కలిశారీ అన్నదమ్ములు

‘ఎన్నాళ్లయింది అన్నయ్యా.. నిన్ను చూసి. ఇన్నాళ్లకు నువ్వు నన్ను కలుసుకున్నావ్​’‘అవున్రా తమ్ముడు, ఇన్నాళ్లకు నిన్ను కలుసుకోగలిగా. 75ఏళ్లు పట్టింది నిన్ను చూడ్డానికి’‘అవును అన్నా.. 75 ఏళ్లు ఆగావు. కానీ, ఇప్పుడు ఇద్దరం కలిశాంగా’

ఇదీ 75 ఏళ్ల క్రితం విడిపోయి, ఇప్పుడు కలుసుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. ఇంట్లో వాళ్లు కొన్ని రోజులు మిస్సయితేనే ఆ బాధ ఎంతలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అలాంటిది 75 ఏళ్లు ఎక్కడున్నారో, అసలున్నారో లేరో తెలియని వారిని తలుచుకుంటూ ఉంటే ఆ బాధ ఇంకెట్లా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి బాధే ఈ అన్నదమ్ములది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో విడిపోయారీ యూదు సోదరులు. పేర్లు మోరిస్​ సనా (87), సైమన్​ మైరోవిజ్​ (85). ఇజ్రాయెల్​ రాజధాని టెల్​ అవీవ్​లో గురువారం కలుసుకున్నారు. ఒకరికొకరు కన్నీటితో స్వాగతం పలికారు. ఎమోషనల్​ హగ్​తో పలకరించుకున్నారు. వాళ్లిద్దరూ మళ్లీ కలవడంలో ముఖ్య పాత్ర పోషించింది సనా కూతురు. ఒకరకంగా వీళ్లు కలవడానికి ఇంటర్నెట్​ (ఆన్​లైన్​) కూడా సాయపడిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే, వాళ్లిద్దరూ బతికే ఉన్నారన్న విషయం ఆన్​లైన్​ ద్వారానే తెలిసింది మరి. సనా కూతురు తన ఫేస్​బుక్​ ఫ్రెండ్​ లిస్ట్​లోని కజిన్​తో మాట్లాడుతుండగా సైమన్​ గురించి తెలిసింది. ఆ విషయం తెలిసిన సనా మనవరాలు ఆ అన్నదమ్ములను కలిపేందుకు నిర్ణయించుకుంది. చివరిసారిగా 1940లో ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. రుమేనియాలో ఉండేవాళ్లు. నాజీలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాక, వాళ్లిద్దరూ ఎలాగోలా వాళ్ల కుటుంబాలతో సురక్షితంగా తప్పించుకోగలిగారు. ఎవరికి వాళ్లూ చనిపోయి ఉండొచ్చులే అనుకుని మరుపున పడ్డారు. సనా ప్రస్తుతం ఇజ్రాయెల్​లోని రాననాలో ఉంటున్నారు. మైరోవిజ్​ బ్రిటన్​లో నివసిస్తున్నారు. అన్న గురించి తెలిసిన మైరోవిజ్​ వెంటనే టెల్​అవీవ్​కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్​లో దిగారు. ఆ హోటల్​కు వెళ్లిన సనా, తన తమ్ముడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి అంటూ కౌగిలించుకున్నారు. అన్న చెంపలపై ఆప్యాయంగా నిమురుతూ మైరోవిజ్​ కూడా ఎమోషనల్​ అయ్యారు.

Morris Sana and Simon Mairowitz
Cousins Reunite 75 Years After Being Separated During the Holocaust: ‘We’ve Got Each Other Now’
https://app.asana.com/0/1135954362417873/1141451382573417/f
Credit: Carmela Ofer