జేసీ ప్రభాకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

జేసీ ప్రభాకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

అట్రాసిటీ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కోర్టులో నిరాశ మిగిలింది. ఆయనకు బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. జేసీ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. తాడిపత్రికి సమీపంలోని  జమ్ములదిన్నులో సీఐ దేవేందర్  ను దూషించి, బెదిరింపులకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.