శివాలయంలో దొంగతనం చేసిన దంపతులు

  • పోలీసులకు  అప్పగించిన ప్రయాణికులు 

మద్దూరు, వెలుగు: మద్దూరు  మండల కేంద్రం శివారులో నిడ్జింత వైపు వెళ్లే రోడ్డు సమీపంలోని శివాలయంలో మంగళవారం దంపతులు దొంగతనం చేశారు.  ఎస్సై రాంలాల్ తెలిపిన వివరాల ప్రకారం మద్దూరు మండల కేంద్రానికి చెందిన ఈరాముష్టి  శ్రీనివాస్, శిరీష దంపతులు రాత్రి ఎవరూ లేని సమయంలో ఆలయంలోని గంటలు, పూజా సామాగ్రి, రాగి కడవలు, అంప్లిఫైర్, మైక్ లతో పాటు పలు సామాన్లను దొంగిలించారు.  

సంచి లో కట్టి బుధవారం ఉదయం మహబూబ్ నగర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. అనుమానం వచ్చిన ఆలయం సమీపంలోని రైతులు బస్సు  డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేశారు. బస్సులో పరిశీలించగా సామాన్ల సంచి ఉన్నట్టు గుర్తించారు.  కోయిల కొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తర లించారు.