లవర్స్ చీటింగ్ ఐడియా : పోలీస్ ఉద్యోగాల పేరుతో రూ.3 కోట్లు దోచుకున్నారు

విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పొలిసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నకిలీ పోలీసుల వేషంలో నిరుద్యోగ యువతను యువతను ఓ ప్రేమ జంట మోసం చేసిన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే, అడవివరానికి చెందిన హనుమంతు సురేష్, తన ప్రియురాలితో కలిసి పోలీసులు ఉద్యోగాల ఎర చూపి 30మంది నిరుద్యోగ యువత నుండి 3కోట్లు దోచుకున్నారు. ఈ జంట ఎస్సై డ్రెస్ లో రావటం చూసి మోసపోయిన యువత కొంతమంది మధ్యవర్తుల ద్వారా డబ్బు ఇచ్చి మోసపోయారు.

ALSO READ :- అన్నారం బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం

ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఈ నకిలీ పొలిసు జంట హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరొక ట్విస్ట్  ఏంటంటే నిందితుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారట. కొన్నాళ్లుగా ప్రియురాలితో కలిసి ఉంటున్న సురేష్ ఈ  మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ వ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కమిషనర్ ఎదుట హాజరు పరిచారు, ఆ తర్వాత రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారని సమాచారం.