క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య..

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్..  తెలిసినవారి దగ్గర అప్పులు చేసినట్లు తెలుస్తోంది. క్రెడిట్ కార్డు నుంచి కూడా డబ్బులు తీసుకున్న సురేష్.. తిరిగి చెల్లించలేకపోయాడు.దీంతో అప్పుల నుంచి బయటపడాలంటే.. చావు ఒక్కటే దిక్కని నిర్ణయించుకున్నాడు.

తన ఇద్దరు పిల్లలు.. సౌషిక్ (17), భవన్ (15)లను అమ్మమ్మ ఇంటికి పంపించి తన భార్య భాగ్యతో కలిసి సురేష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమచారం అందుకున్న కీసర పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి  చేరుకున పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ | తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు